రోగి మరణంలో నర్స్ పై హత్య కేసు.. కొట్టేసిన బహ్రెయిన్ కోర్టు
- November 12, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్ హై అప్పీల్స్ కోర్ట్.. మంచం మీద నుండి వీల్ చైర్‌పైకి తరలించేటప్పుడు పడిపోయిన ఒక ఆసియా రోగి చనిపోయిన కేసులో హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న ఓ నర్సును నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది. బాధితురాలు పడిపోయిన సమయంలో ఆ నర్స్ సంఘటన జరిగిన ప్రాంతంలో లేదని కేసు పత్రాల ద్వారా కోర్టు ధృవీకరించింది. కాగా, రెండో నర్సును దోషిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. వృత్తిపరమైన ప్రక్రియను ఉల్లంఘించిన కారణంగా హత్య ఆరోపణలపై విచారణకు ఇద్దరు నర్సులను ప్రాసిక్యూషన్ సిఫార్సు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. జ్వరంతో బాధపడుతున్న ఒక ఆసియా రోగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె CT స్కాన్‌తో మెదడులో రక్తస్రావం జరిగిందని నిర్ధారణ అయింది. ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది.
నిపుణుల అభిప్రాయం కోసం నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA)కి కేసును రిఫర్ చేశారు. ఇందులో బాధితురాలిని పర్యవేక్షిస్తున్న ఇద్దరు నర్సుల నిర్లక్ష్యం ఉందని కోర్టు నిర్ధారించింది. రోగిని ఆమె మంచం నుండి వీల్‌చైర్‌కు మార్చడంలో పొరబాటు జరిగిందని, ఇది రోగి నేలపై పడి ఆమె తలకు గాయం అయిందని నిర్ధారించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంలో నర్సులు విఫలమయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. అయితే, బాధితురాలు పడిపోయినప్పుడు మొదటి నర్స్ అక్కడ లేదని, రెండో నర్స్ జరిగిన విషయాన్ని దాచిపెట్టినట్లు NHRA పత్రాల ద్వారా కోర్టు నిర్ధారించింది.
తాజా వార్తలు
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్‌ప్రెస్‌వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్‌ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్‌లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్‌పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..







