రోగి మరణంలో నర్స్‌ పై హత్య కేసు.. కొట్టేసిన బహ్రెయిన్ కోర్టు

- November 12, 2023 , by Maagulf
రోగి మరణంలో నర్స్‌ పై హత్య కేసు.. కొట్టేసిన బహ్రెయిన్ కోర్టు

బహ్రెయిన్: బహ్రెయిన్ హై అప్పీల్స్ కోర్ట్.. మంచం మీద నుండి వీల్ చైర్‌పైకి తరలించేటప్పుడు పడిపోయిన ఒక ఆసియా రోగి చనిపోయిన కేసులో హత్య ఆరోపణలను ఎదుర్కొంటున్న ఓ నర్సును నిర్దోషిగా ప్రకటించడాన్ని సమర్థించింది.  బాధితురాలు పడిపోయిన సమయంలో ఆ నర్స్ సంఘటన జరిగిన ప్రాంతంలో లేదని కేసు పత్రాల ద్వారా కోర్టు ధృవీకరించింది. కాగా, రెండో నర్సును దోషిగా నిర్ధారించి ఒక సంవత్సరం జైలు శిక్ష విధించింది. వృత్తిపరమైన ప్రక్రియను ఉల్లంఘించిన కారణంగా హత్య ఆరోపణలపై విచారణకు ఇద్దరు నర్సులను ప్రాసిక్యూషన్ సిఫార్సు చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. జ్వరంతో బాధపడుతున్న ఒక ఆసియా రోగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె CT స్కాన్‌తో మెదడులో రక్తస్రావం జరిగిందని నిర్ధారణ అయింది.  ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించింది.  

నిపుణుల అభిప్రాయం కోసం నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (NHRA)కి కేసును రిఫర్ చేశారు. ఇందులో బాధితురాలిని పర్యవేక్షిస్తున్న ఇద్దరు నర్సుల నిర్లక్ష్యం ఉందని కోర్టు నిర్ధారించింది. రోగిని ఆమె మంచం నుండి వీల్‌చైర్‌కు మార్చడంలో పొరబాటు జరిగిందని, ఇది రోగి నేలపై పడి ఆమె తలకు గాయం అయిందని నిర్ధారించారు. బాధితురాలికి చికిత్స అందించిన వైద్యులకు జరిగిన విషయాన్ని తెలియజేయడంలో నర్సులు విఫలమయ్యారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు రిఫర్ చేసింది. అయితే, బాధితురాలు పడిపోయినప్పుడు మొదటి నర్స్ అక్కడ లేదని, రెండో నర్స్ జరిగిన విషయాన్ని దాచిపెట్టినట్లు NHRA పత్రాల ద్వారా కోర్టు నిర్ధారించింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com