సముద్రంలో కూలిన హెలికాప్టర్.. ఐదుగురు సైనికులు మృతి
- November 13, 2023
న్యూయార్క్: అమెరికా ఆర్మీకి చెందిన హెలికాప్టర్ మధ్యధార సముద్రం లో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు అమెరికన్ సర్వీస్ సైనికులు మృతి చెందారు. ఈ విషయాన్ని యూఎస్ మిలిటరీ ధ్రువీకరించింది. ఈ ఘటన నవంబర్ 10న చోటు చేసుకున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధారా ప్రాంతంలో అమెరికా ఓ ఆర్మీ బృందాన్ని మోహరించింది. ఇందులో భాగంగా రోజూవారీ శిక్షణలో భాగంగా నవంబర్ 10వ తేదీన ఆర్మీ హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. కాసేపటికి సాకేంతిక సమస్య తలెత్తడంతో సముద్రంలో కుప్పకూలింది. ఆ సమయంలో హెలికాప్టర్లో ఉన్న ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు యూఎస్ మిలిటరీ ఆదివారం వెల్లడించింది.
కాగా, సైనికుల మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. వారి మరణం తనను కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వారి కుటుంబాలకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. అమెరికా ప్రజలు సురక్షితంగా జీవితం గడపటం కోసం సైనికులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని బైడెన్ అన్నారు. దేశం కోసం వారి జీవితాలను, ప్రాణాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవలను జో బైడెన్ కొనియాడారు.
తాజా వార్తలు
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!
- ఆదాయపన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ సురేశ్ బత్తిని
- హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘హైదరాబాద్ స్ట్రీట్’ ప్రారంభం
- RGIAలో సుమారు ₹4.6 కోట్ల విలువైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం, ఇద్దరి అరెస్టు
- నగదు టోల్‌కు గుడ్‌బై..FASTag/UPI తప్పనిసరి
- ఇన్‌స్టాగ్రామ్‌లో టీనేజర్ల కోసం మెటా కొత్త రూల్స్ ఇవే
- మయన్మార్ అధ్యక్షుడిగా మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రమాణ స్వీకారం
- తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త
- హర్మూజ్ పై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన
- యూఏఈ–భారత్ స్నేహాన్ని ప్రతిబింబిస్తూ విద్యార్థుల ప్రదర్శన









