రియాద్‌లో ఇరాన్ అధ్యక్షుడు రైసీని కలిసిన క్రౌన్ ప్రిన్స్

- November 13, 2023 , by Maagulf
రియాద్‌లో ఇరాన్ అధ్యక్షుడు రైసీని కలిసిన క్రౌన్ ప్రిన్స్

రియాద్: సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ సల్మాన్ శనివారం రియాద్‌లో జరిగిన అసాధారణ అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఈ ప్రాంతంలోని పరిణామాలపై చర్చించారు. ముఖ్యంగా గాజా స్ట్రిప్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించారు.  పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ భీకర యుద్ధాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్లు క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. తక్షణమే ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. గాజా ప్రజల బాధలను తగ్గించడానికి మానవతా కారిడార్‌లను ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ మానవతా సంస్థలను అనుమతించాలని కోరారు. అలాగే బందీలను,  ఖైదీలను విడుదల చేయాలని.. అమాయక ప్రజల జీవితాలను రక్షించడానికి క్రౌన్ ప్రిన్స్ పిలుపునిచ్చారు. ఆగస్ట్ 2021లో అధికారం చేపట్టిన తర్వాత ప్రెసిడెంట్ రైసీ సౌదీ అరేబియాకు ఇది మొదటిసారి. సౌదీ అరేబియా మరియు ఇరాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు మార్చి 2023లో పునరుద్ధరించబడ్డాయి. దౌత్య కార్యకలాపాలు ప్రారంభం అయ్యాయి. రెండు దేశాల రాజధానులలోనూ రాయబార కార్యాలయాలు పునఃప్రారంభించబడ్డాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com