‘దేవర’ కోసం మరో ‘నాటు నాటు’ రేంజ్ సాంగ్

- November 14, 2023 , by Maagulf
‘దేవర’ కోసం మరో ‘నాటు నాటు’ రేంజ్ సాంగ్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు..’ సాంగ్ ఆస్కార్ విన్నింగ్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచం మొత్తం ఓ ఊపు ఊపేసింది ఈ పాట.

ఇప్పుడు ఈ తరహాలోనే మరో సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఎన్టీయార్ నటిస్తున్న ‘దేవర’ కోసం. ‘దేవర’ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, ఎన్టీయార్‌లాంటి హీరోకి అనిరుధ్ అందించబోయే మ్యూజిక్ ఎలా వుండబోతోంది.? ఖచ్చితంగా దద్దరిల్లిపోతుంది. దీపావళి టపాస్ లాంటి ఓ సాంగ్‌ని ఆల్రెడీ కంపోజ్ చేశాడట అనిరుధ్.

ఈ పాట సినిమాకి ఖచ్చితంగా హైలైట్ అవుతుందనీ, ‘నాటు నాటు..’ సాంగ్‌ని బీట్ చేసే ప్లానింగ్‌తో సిద్ధం చేస్తున్నారనీ తెలుస్తోంది.

ఇక, ఈ సాంగ్‌లో ఎన్టీయార్ స్టెప్పులు నభూతో న భవిష్యతి అనే స్థాయిలో వుండబోతున్నాయట. ఏకంగా 2000 మంది డాన్సర్లతో ఈ సాంగ్‌ని ప్రేమ్ రక్షిత్ కంపోజ్ చేయబోతున్నారట.

ప్యాన్ ఇండియా మూవీగా రూపొందబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com