సెన్సార్ కమిటీ అఆ ను సూపర్ అనేసిందన్నమాట..!
- May 25, 2016
త్రివిక్రం సినిమా వస్తుందంటే చాలు పరిశ్రమలో సిని పండితులు సైతం ఆ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తారు. ప్రస్తుతం త్రివిక్రం డైరెక్ట్ చేసిన సినిమా అఆ. నితిన్, సమంత జంటగా నటించిన ఈ సినిమా జూన్ 2న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఈరోజు సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది.
త్రివిక్రం సినిమాలన్ని ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలే.. కావలని వల్గారిటీని చూపించేందుకు ఇష్టపడని దర్శకుల్లో త్రివిక్రం ఒకరు. ఇక అఆ సినిమా అయితే తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమా. ముందునుండి ఈ సినిమా షూటింగ్ లో కొన్ని అనివార్య సంఘటనలు సినిమా మీద బ్యాడ్ టాక్ వచ్చేలా చేశాయి. ఇక సెన్సార్ సభ్యులు మాత్రం సినిమా ఓ మంచి చిత్రంగా నిలుస్తుందని అన్నారట.
మొదటి సగం బాగున్నా సినిమా సకండ్ హాఫ్ లో కాస్త స్లో అవుతుందని అన్నారట. ఇక మరోసారి త్రివిక్రం తన పెన్ పవర్ ను ఈ సినిమాతో చూపించాడని ప్రశంసించారట. సో మొత్తానికి సెన్సార్ కమిటీ అఆ ను సూపర్ అనేసిందన్నమాట. ఇక సమంత కీలక పాత్రలో వస్తున్న ఈ సినిమాలో ఆమె నటన కూడా అందరిని ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.
మరి సెన్సార్ వారు మెచ్చిన అఆ.. ప్రేక్షకులు మెప్పు కూడా పొందక తప్పదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంలో వస్తున్న ఈ సినిమాను మిక్కి జే మేయర్ సంగీతం అందించగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుండటం విశేషం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







