రైతులను విశేషంగా ఆకట్టుకున్న ఉద్యానవన ప్రదర్శన
- May 25, 2016
పండ్ల రారాజు మామిడి, పసందైన పనస తొనలను రుచి చూడాలనుకునే నగర వాసుల కోసం రాష్ట్ర ఉద్యానవన శాఖ ‘మామిడి మేళాను ఏర్పాటు చేసింది. 23 వ తెదే నుంచి 25 వ తేదీ వరకు ఉద్యానవన మహోత్సవాన్నినిర్వహిస్తున్నారు. ముందుగా మామిడి మేళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రథమ ఉద్యానవన మహోత్సవం, మామిడి ప్రదర్శనను విజయవాడ లయోలా కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఫుడ్ ప్రొసీసింగ్ కార్యదర్శి గిరిజా శంకర్, సి. ఇ. ఓ. వైఎస్ ప్రసాద్, హర్టికల్చర్ చిరంజీవి చౌదరి, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నర్సరీ సామూహిక ప్రదర్శన స్టాల్ల్స్‌ను, మామిడిపళ్ళ ప్రదర్సన స్టాల్, డ్రిప్, మైక్రో ఇరిగేషన్ స్టాల్‌లను ముఖ్యమంత్రి పరిశీలించారు. రుమానియా, తోతాపూరి, సువర్ణ రేఖ , సొరమామిది, ఏనుగు దంతం , చెక్కరగుత్తి బాదామి, రసపురి, మలికా, సేందూరి, తదితర 250 రకాల మామిడిపండ్లు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్నో రకాల మామిడి పండ్లును ఈ ప్రదర్శనలో కొలువుదీరాయి. రకాలతో పాటు వివిధ పనస రకాలు కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మామిడి రైతులు 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. సహజసిద్ధంగా ‘మాగిన’ పండ్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో కార్బైడ్స్ ఉపయోగించి మగ్గబెట్టిన మామిడి రకాలను ఈ ప్రదర్శనలో నిషేధించారు. కార్బైడ్స్ రహిత మామిడిపండ్లు ఈ ప్రదర్శనలో ఉంచారు. అదే విధంగా, ఆయిల్ పామ్, అరటి రకాలు , ఈస్ట్ కోస్ట్ , గంగాబొండం కొబ్బరి రకాలని ఇక్కడ ప్రదర్శించారు. ఉద్యానవన విభాగం ద్వారా ప్రత్యేక ఆకర్షణగా వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శన రైతులను విపరీతంగా ఆకట్టుకొంది..
రాష్ట్ర ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసిన స్మూక్ష నీటిసాగు పధకం ప్రదర్శన స్టాల్ వద్ద పలువురు రైతులు ఎంతో ఆసక్తిగా తిలకించి పలు విషయాల గూర్చి అడగి తెలుసుకొన్నారు. డ్రిప్ పద్ధతి వలన కలిగే లాభాలు గూర్చి పలు విషయాలని వ్యవసాయ నిపుళుల నుంచి అడిగి తెలుసుకొన్నారు.
కోకో నట్ బోర్డ్ హైదరాబాద్ ద్వారా ఏర్పాటు చేసిన కొబ్బరి ఉప ఉత్పత్తుల స్టాల్ రైతులను విశేషంగా ఆకట్టుకొంది. కొబ్బరి స్కావ్ష్ , నీరా, కో కో నట్ మిల్క్ పౌడర్, కొబ్బరి చిప్స్, కొబ్బరి తేనె , కొబ్బరి బిస్కెట్స్ , తో పాటు కొబ్బరి చిప్పలతో వివిధ ఆకృతులతో కూడిన బొమ్మలు , కొబ్బరి పీచుతో బ్యాగులు తదితర వస్తువులను గూర్చి తిలకించారు.
రాష్ట్ర ఉద్యానవన శాఖ డైరక్టర్ చిరంజీవి చౌదరి ఈ సందర్భంగా దూరదర్సన్ సప్తగిరి చానల్ తో మాట్లాడుతూ , పండ్ల తోటల ఆవశ్యకతని, ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయతీలను రైతులకు వివరించడంలో తాము కృతార్ఢులైనట్లు సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను , వ్యాపారులను ఈ వేదిక ద్వారా అనుసంధానం చేశామన్నారు. ఇక్కడ దాదాపు 55 మంది కొనుగోలుదారులు ఈ ప్రదర్శనకు హాజరయ్యారు. 13 జిల్లాల నుండి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారని అన్నారు. ఉద్యానవన పంటలలో అనవసర వ్యయాలు ఎలా తగ్గించుకోవాలో తమ శాఖ ఎంతో విలువైనా సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. సానుకూల వాతావరణంలో సాగిన ఈ ప్రదర్శన గూర్చి తమకు చక్కని ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు.
ఈ ప్రదర్శనకు విజయనగరం జిల్లా నుంచి వచ్చిన కొందరు రైతులు నెల గుమ్మడి, తిప్ప తీగ , శీకాయ్ తదితర వివిధ వన మూలికలను ఇక్కడ ప్రదర్శించారు.
హర్టికల్చర్ విశ్వవిద్యాలయం వెంకటరమణ గూడెం వ్యవసాయ శాత్రవేత్తలు అభివృద్ధి చేసిన పలు కొత్త రకం వంగడాలని ఈ ప్రదర్శనలో ప్రదర్శించారు.
మరింతగా ఆసక్తి చూపిన కొందరు రైతులకు ప్రత్యేక శిక్షణని ఉద్యానవన శాఖ ఏర్పాటు చేసింది వీరికి మరింత అవగాహన కోసం పవర్ పాయింట్ ప్రజేన్ టేషన్ ద్వారా వివిధ అంశాలను చూపించారు. అదేవిధంగా నమూనా వ్యవసాయ క్షేత్రం ఏర్పాటుచేసి వివిధ రకాల వ్యవసాయ పరికరాలను రైతులకు ప్రయోగాత్మకంగా వివరిచారు.
.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







