సౌదీ, ఇద్దరు ప్రవాసులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష
- November 16, 2023
జెడ్డా: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడినందుకు సౌదీ కోర్టు ఒక సౌదీ పౌరుడు, ఇద్దరు అరబ్ జాతీయులకు మొత్తం 55 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకారం, దోషులలో ఒకరికి 25 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించగా.. మరో ఇద్దరికి ఒక్కొక్కరికి 15 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అలాగే కోర్టు దోషులకు SR300000 జరిమానా విధించింది. జైలు శిక్షలు మరియు జరిమానాలు చెల్లించిన తర్వాత రాజ్యం నుండి ప్రవాసులను బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న షిప్మెంట్లో నిందితులు సైకోట్రోపిక్ యాంఫెటమైన్ (క్యాప్‌గాన్), 3,42,000 మాత్రలు తీసుకువచ్చారని దర్యాప్తులో వెల్లడైంది. గ్యాంగ్ లీడర్‌గా ఉన్న అరబ్ జాతీయుడు సౌదీ అరేబియాకు షిప్మెంట్ వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లినట్లు గుర్తించారు. ఇతర నిందితులను షిప్మెంట్ స్వీకరించడానికి వచ్చిన సమయంలో అదుపులోకి తీసుకున్నారు. ముఠా నాయకుడు రాజ్యానికి తిరిగి వచ్చాక అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







