యూఏఈలో భారీ వర్షాలు.. మూడు ఎమిరేట్స్‌లో రిమోట్ లెర్నింగ్
- November 17, 2023
యూఏఈ: మూడు ఎమిరేట్స్‌లోని అధికారులు అస్థిర వాతావరణ పరిస్థితుల కారణంగా నవంబర్ 17 (శుక్రవారం) రిమోట్ లెర్నింగ్ కు మారాలని పాఠశాలలను ఆదేశించారు. ఈ మేరకు అజ్మాన్, రస్ అల్ ఖైమా మరియు ఉమ్ అల్ క్వైన్‌లోని స్థానిక అత్యవసర సంక్షోభం మరియు విపత్తు నిర్వహణ బృందాలు వేర్వేరు ప్రకటనలలో తెలిపారు. జాతీయ వాతావరణ కేంద్రం (NCM) గురువారం మధ్యాహ్నం రస్ అల్ ఖైమాలో భారీ వర్షం కురిసిందని పేర్కొంది. దుబాయ్, షార్జా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో దేశంలోని తూర్పు, ఉత్తర మరియు తీరప్రాంతాల్లో మెరుపులు, ఉరుములు మరియు వివిధ తీవ్రతలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రోడ్లపై జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాల వేగాన్ని తగ్గించాలని, వరదలు మరియు బీచ్‌లకు దూరంగా వుండాలని నివాసితులకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే Dh 2,000 వరకు జరిమానాలు, 23 బ్లాక్ పాయింట్లు మరియు రెండు నెలల పాటు వాహనాన్ని జప్తు చేఅవకాశం ఉందని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







