డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు ఉంది: ప్రధాని మోడీ
- November 17, 2023
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనమిస్తున్నాయి. ప్రధానంగా సినీ తారల అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. వేరొకరి ముఖాల స్థానంలో రష్మిక మందన్న, కాజోల్ వంటి తారల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందిస్తున్న ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఉంటున్నాయి. అంతెందుకు, ప్రధాని నరేంద్ర మోడీ ఓ పాట పాడినట్టు డీప్ ఫేక్ వీడియో రూపొందించడం ఇదెంతటి తీవ్రమైన సమస్యో చెబుతోంది. ఇలాంటి వీడియోలపై సర్వత్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా పరిణమిస్తున్నాయని, సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.
“ఇటీవల తెలిసిన వాళ్లు నాకు ఓ వైరల్ వీడియో పంపించారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా ఉంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలి” అని మోడీ పిలుపునిచ్చారు. అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు మోడీ వెల్లడించారు. ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!







