ఖతార్ ప్రధాన మంత్రితో బహ్రెయిన్ యువరాజు సమావేశం

- November 18, 2023 , by Maagulf
ఖతార్ ప్రధాన మంత్రితో బహ్రెయిన్ యువరాజు సమావేశం

బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా శుక్రవారం గుదైబియా ప్యాలెస్‌లో ఖతార్ రాష్ట్ర ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి, HE షేక్ మొహమ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్-థానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు బహ్రెయిన్-ఖతార్ భాగస్వామ్యం, సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలను సమీక్షించారు.  HRH ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడానికి.. రెండు దేశాలు మరియు వారి ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. బహ్రెయిన్-ఖతార్ కాజ్‌వే ప్రాజెక్ట్‌పై పరిణామాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అమలును ప్రారంభించడానికి అవసరమైన ప్రణాళికలను పూర్తి చేయాలని రెండు పార్టీలు సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే గాజా స్ట్రిప్‌లోని పరిణామాలతో సహా ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com