పని ప్రదేశాల్లో జాత్యహంకారం, వివక్షకు సౌదీ వ్యతిరేకం

- November 18, 2023 , by Maagulf
పని ప్రదేశాల్లో జాత్యహంకారం, వివక్షకు సౌదీ వ్యతిరేకం

 సౌదీ అరేబియా: సమానత్వం, వైవిధ్యాన్ని సమర్థిస్తూ పని ప్రాంతాలలో జాత్యహంకారం, వివక్షను ఎదుర్కోవడానికి సౌదీ అరేబియా తన తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటించింది.  ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 78వ సెషన్‌లో ఐదవ కమిటీ సాధారణ చర్చలో సౌదీ అరేబియా ప్రతినిధి మాట్లాడారు. ప్రత్యేకంగా ఎజెండా అంశం 136 కింద "జాత్యహంకారాన్ని ఎదుర్కోవడం, అందరికీ గౌరవాన్ని ప్రోత్సహించడం అనే టాఫిక్ పై ప్రసంగించారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా జరిగే పోరాటం ప్రపంచ సాంఘిక, ఆర్థిక మరియు సాంస్కృతిక పురోగతిని పురోగమించడంలో ఒక మూలస్తంభమని ఇదే సౌదీ అరేబియా బలం అన్నారు. విజన్ 2030 ద్వారా అమలు చేయబడిన కార్యక్రమాలు, సంస్కరణలను ప్రదర్శించడం ద్వారా సౌదీ అరేబియా తన నిబద్ధతను మరోసారి స్పష్టం చేసింది. సౌదీలో జాతీయత వంటి వివక్షాపూరిత ప్రమాణాల కంటే ఉద్యోగుల పనితీరు, విజయాల ఆధారంగా అంచనా వేయడంపై దృష్టి పెడతాయని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com