బాలయ్యకు పోటీగా రణ్‌బీర్ కపూర్.!

- November 18, 2023 , by Maagulf
బాలయ్యకు పోటీగా రణ్‌బీర్ కపూర్.!

ఓటీటీలో బాలయ్య విశ్వరూపం  చూపిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. మొదటి రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన బాలయ్య.. మూడో సీజన్ కోసం సంసిద్ధమయ్యారు. తనదైన ఎనర్జీతో తనదైన డైలాగులతో కట్టి పడేస్తున్నారు.
అయితే ఈ సీజన్ ‘అన్‌స్టాపబుల్’ ఇంకా స్పెషల్‌గా అదిరిపోనుంది. ఎందుకంటే, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఈ సారి ఈ షోకి గెస్ట్‌గా రావడమే షోకి హైలైట్‌గా మారింది. ఓకే.! ఆయన సినిమా ‘ఏనిమల్’‌ని ప్రమోట్ చేసుకునేందుకు రణ్‌బీర్ వస్తున్నాడులే అనుకుంటే కాదండోయ్.
బాలయ్య డైలాగుల్ని వరుసగా వదులుతూ బాలయ్య హావభావాల్ని అచ్చుగుద్దినట్లు దించేయడమే విశేషం. రష్మిక మండన్నాతో కలిసి రణ్‌బీర్ కపూర్ ఈ షోకి హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు.
ప్రోమో అయితే, సూపర్.. బంపర్.! అదరగొట్టేశారు. మరి, షోలో ఈ మజా అసలుందో లేదో తెలియాలంటే.. షో టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ నెల 24న ఈ షో ప్రసారం కానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com