ఫ్యాన్స్‌ని నిరాశ పరిచిన మెగా హీరో.!
- November 18, 2023
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ పంజా నటించిన తాజా చిత్రం ‘ఆదికేశవ’ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, టెక్నికల్ ఇష్యూస్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదా పడింది. నవంబర్ 24న రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్లు. అయితే, అనుకున్న టైమ్‌కి ట్రైలర్ రిలీజ్ కాలేదు. ట్రైలర్ కోసం మెగా ప్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. కానీ, వారి ఆశలు నిరాశగానే మిగిలాయ్.
అసలెందుకు ట్రైలర్ రిలీజ్ కాలేదు.? అంటే సమ్ టెక్నికల్ ఇష్యూస్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో వైష్ణవ్ తేజ్ ఫ్యాన్స్‌కి క్షమాపణలు తెలిపాడు. అనుకోని కారణాల వల్ల ట్రైలర్ రిలీజ్ కాలేదు. త్వరలోనే కొత్త డేట్ ప్రకటిస్తామని.. ఫ్యాన్స్‌కి సోషల్ మీడియా ద్వారా క్షమాపణలు తెలిపాడు వైష్ణవ్ తేజ్.
శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇంతవరకూ వచ్చిన ప్రోమోలు ఎట్రాక్టివ్‌గా అనిపిస్తున్నాయ్. మంచి ఎంటర్‌టైమెంట్‌తో పాటూ, వైష్షవ్ తేజ్‌లోని మాస్ యాక్షన్ హీరో ఈ సినిమాతో బయటికి రాబోతున్నాడని ప్రోమోస్ చూస్తుంటే అర్ధమవుతోంది. చూడాలి మరి, ఎలా వుంటుందో ‘ఆదికేశవ్’.!
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!