హైదరాబాద్ టూ షిర్డీ టూర్..
- November 18, 2023
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి షిర్డీ టూర్ వెళ్లాలనుకునే పర్యాటకులకు శుభవార్త. తక్కువ ఖర్చులో ఎంచక్కా ఫ్లైట్లో షిర్డీ వెళ్లే అవకాశం పొందొచ్చు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ అవకాశాన్ని కల్పించింది. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇప్పటికే షిర్డీకి ఏసీ బస్సు సర్వీసును అందిస్తోండగా దానికి అదనంగా విమాన సేవలను అందిస్తోంది.
దీంతో ఎలాంటి రిస్క్ లేకుండా ప్రయాణికులు షిర్డీ టూర్ వెళ్లొచ్చు. ఇంతకి ఈ టూర్లో ఏయే ప్రాంతాలు కవర్ అవుతాయి.? ప్రయాణం ఎలా సాగుతుంది.? ప్యాకేజీ వివరాలు మీకోసం. ఈ టూర్ ప్యాకేజీ ధరను రూ. 12,499గా నిర్ణయించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా.. హైదరాబాద్లో విమానాశ్రాయానికి చేర్చట మొదలు, హోటల్, భోజనం, వసతి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. షిర్డీలో స్థానికంగా ఉన్న పర్యాటక ప్రాంతాలకు తీసుకెళ్లటం కూడా తమ బాధ్యతేనని తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రకటించింది.
ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 1.30 గంటలకు ఫ్లైట్ జర్నీ ప్రారంభమవుతుంది. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు షిర్డీ చేసుకుంటారు. అనంతరం హోటల్లో చెకిన్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం 4.30 గంటలకు షిర్డీ సాయి దర్శనం ఉంటుంది. సాయంత్రం హారతి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. తర్వాత రాత్రి 7 గంటలకు బాబా థీమ్ పార్క్లో సౌండ్ అండ్ లైట్ షోను చూడొచ్చు.
రాత్రి హోటల్లో బస చేయాల్సి ఉంటుంది. అనంతరం రెండో రోజు ఉదయం టిఫిన్ చేయాల్సి ఉంటుంది. అనంతరం 8 గంటలకు పంచముఖి గణపతి మందిర దర్శనం ఉంటుంది. అనంతరం పాత షిర్డీ, ఖండోబా మందిర్, సాయి తీర్థం వంటి ప్రదేశాలను సందర్శించాల్సి ఉంటుంది. తర్వాత భోజనం చేయగానే.. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు విమానం బయలుదేరి సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకుంటారు. భోజనం, హోటల్లో బస వంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. అయితే కొన్ని దర్శన టికెట్లు మాత్రం స్వయంగా చెల్లించుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..