బాలయ్యకు పోటీగా రణ్‌బీర్ కపూర్.!
- November 18, 2023
ఓటీటీలో బాలయ్య విశ్వరూపం చూపిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. మొదటి రెండు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసిన బాలయ్య.. మూడో సీజన్ కోసం సంసిద్ధమయ్యారు. తనదైన ఎనర్జీతో తనదైన డైలాగులతో కట్టి పడేస్తున్నారు.
అయితే ఈ సీజన్ ‘అన్‌స్టాపబుల్’ ఇంకా స్పెషల్‌గా అదిరిపోనుంది. ఎందుకంటే, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ ఈ సారి ఈ షోకి గెస్ట్‌గా రావడమే షోకి హైలైట్‌గా మారింది. ఓకే.! ఆయన సినిమా ‘ఏనిమల్’ని ప్రమోట్ చేసుకునేందుకు రణ్‌బీర్ వస్తున్నాడులే అనుకుంటే కాదండోయ్.
బాలయ్య డైలాగుల్ని వరుసగా వదులుతూ బాలయ్య హావభావాల్ని అచ్చుగుద్దినట్లు దించేయడమే విశేషం. రష్మిక మండన్నాతో కలిసి రణ్‌బీర్ కపూర్ ఈ షోకి హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో లేటెస్ట్గా రిలీజ్ చేశారు.
ప్రోమో అయితే, సూపర్.. బంపర్.! అదరగొట్టేశారు. మరి, షోలో ఈ మజా అసలుందో లేదో తెలియాలంటే.. షో టెలికాస్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఈ నెల 24న ఈ షో ప్రసారం కానుంది.
తాజా వార్తలు
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!







