గాజా సంఘర్షణ.. చైనాకు ఇస్లామిక్ మంత్రుల బృందం
- November 19, 2023
మనామా: గాజాలో వివాదానికి ముగింపు పలికే లక్ష్యంతో అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చేందుకు ఇస్లామిక్ మినిస్టీరియల్ కమిటీ మిషన్ సిద్ధమైంది. మొదటగా చైనాలో పర్యటించనున్నట్లు సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ ప్రకటించారు. మనామా డైలాగ్ 2023 సందర్భంగా విలేకరులను ఉద్దేశించి ప్రిన్స్ ఫైసల్ ప్రసంగించారు. రియాద్‌లో ఇటీవల జరిగిన శిఖరాగ్ర సమావేశం తరువాత అరబ్, ఇస్లామిక్ నాయకులు నియమించబడిన మంత్రులు సోమవారం బీజింగ్‌కు వెళ్లనున్నట్లు వెల్లడించారు. సౌదీ విదేశాంగ మంత్రి తమ చైనా పర్యటన నేపథ్యంలో తక్షణ కాల్పుల విరమణ ఆవశ్యకతను తెలియజేస్తామని, గాజాలోకి సహాయక మరియు మానవతా సహాయాన్ని సులభతరం చేసేందుకు అనేక దేశాలను మంత్రుల బృందం సందర్శిస్తుందని తెలిపారు. OIC మరియు అరబ్ లీగ్‌లోని అన్ని సభ్య దేశాల తరపున తక్షణ అంతర్జాతీయ చర్యను ప్రారంభించాలని సౌదీ అరేబియా, జోర్డాన్, ఈజిప్ట్, ఖతార్, టర్కీ, ఇండోనేషియా, నైజీరియా మరియు పాలస్తీనా విదేశాంగ మంత్రులకు అసాధారణ ఉమ్మడి అరబ్-ఇస్లామిక్ సమ్మిట్ ఒక తీర్మానాన్ని జారీ చేసింది.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







