కువైట్ లో ఐదు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు సీజ్

- November 20, 2023 , by Maagulf
కువైట్ లో ఐదు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు సీజ్

కువైట్: ఆరోగ్య అధికారులు అనేక తీవ్రమైన ఉల్లంఘనలను పర్యవేక్షించిన తర్వాత ఒక డిస్పెన్సరీ, నాలుగు వైద్య కేంద్రాలతో సహా ఐదు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలను మూసివేశారు. అధికారుల నివేదిక ప్రకారం.. ఈ వైద్య కేంద్రాలలో పర్యవేక్షించబడిన ప్రధాన ఉల్లంఘనలలో రెసిడెన్సీ పర్మిట్లు లేని కార్మికుల నియామకం,  గడువు ముగిసిన మందుల వాడకం, లైసెన్స్ లేని మందుల దుకాణాల నిర్వాహణ వంటి ఉల్లంఘనలు ఉన్నాయి. కొన్ని కేంద్రాలు ఈ విషయంలో ప్రత్యేక లైసెన్సులు పొందకుండానే వైద్యవృత్తులను కూడా ప్రాక్టీస్ చేస్తున్నాయి. అన్ని ఉల్లంఘనలను సంబంధిత అధికారులు సాక్ష్యాలతో సహా నిరూపించారని నివేదిక పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com