అడవి శేష్ ‘జీ 2’ అంతకు మించి.!
- November 20, 2023
‘క్షణం’ తదితర సినిమాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడవి శేష్. కేవలం నటుడిగానే కాదు, టెక్నికల్‌గానూ బోలెడంత సౌండ్ వున్నోడు మనోడు.
అదేనండీ.! డైరెక్షన్ గట్రా టెక్నికల్ క్వాలిటీస్ బాగా తెలిసినోడు. మల్టీ టాలెంటెడ్. ‘గూఢచారి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత ‘హిట్ 2’ తదితర సినిమాలతోనూ మంచి హిట్ ట్రాక్ దక్కించుకున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా ‘G 2'. ఇదేం సినిమా అనుకోకండి.! సూపర్ డూపర్ హిట్ సినిమా ‘గూఢచారి’కి సీక్వెలే ఈ ‘G 2’.
స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. బనితా సందు ఈ సినిమాలో అడవి శేష్‌కి హీరోయిన్‌గా నటిస్తోంది. ఎవరీ బనితా సందు అనుకుంటున్నారా.?
సీనియర్ తమిళ నటుడు విక్రమ్ తనయుడు ధృవ్ డెబ్యూ మూవీ హీరోయినే ఈ బనితా సందు. ఈ సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టబోతోంది.
ఇకపోతే, ‘గూఢచారి’ మేకింగ్ వాల్యూస్‌లో చాలా రిచ్‌నెస్ చూపించారు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు జోరు చూపించింది ఈ సినిమా.
అంతకు మించిన సాహసాలు, హయ్యెస్ట్ వాల్యూస్ ఆఫ్ మేకింగ్‌తో ఈ సీక్వెల్ రూపొందించబోతున్నారట. విజువల్ వండర్ కానుందనీ అంటున్నారు చూడాలి మరి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







