మధుమేహం వున్నవారు ఈ ఆకుల్ని ఎక్కువగా తీసుకుంటే.!
- November 22, 2023
మధుమేహం.. షుగర్ వ్యాధి ఒక్కసారి తగిలిందంటే చాలు.. ఇక జీవితం అయిపోయినట్లే అని భావించేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు, మందులతో పాటూ, కొన్ని సహజసిద్ధమైన పద్ధతుల ద్వారా కూడా మధుమేహాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు.
ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి మధుమేహం వున్నవారు. వాటిలో మెంతికూరను మధుమేహులకు వరంగా భావిస్తారు. మెంతికూరలోని పోషకాలు సహజ సిద్ధంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో వుంచేందుకు సహాయ పడుతుంది.
అలాగే, కరివేపాకు కూడా షుగర్ వ్యాధి గ్రస్గులు తప్పక తీసుకోవాల్సిన ఆకు. కూరల్లో కరివేపాకును చాలా ఈజీగా తీసి పక్కన పడేస్తుంటాం. కానీ, కరివేపాకను అస్సలు లైట్ తీసుకోరాదు. కరివేపాకులోని ఫైబర్ రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో వుంచేందుకు తోడ్పడుతుంది.
అలాగే, ఇన్సులిన్ చర్యను సైతం వేగవంతం చేస్తుంది. అందుకే కరివేపాకును క్రమం తప్పకుడా ప్రతీరోజూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మెంతికూరను కనీసం రెండు రోజులకోసారి అయినా డయాబెటిక్ వ్యాదిగ్రస్తులు తమ మెనూలో వుండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటితో పాటూ, తీసుకోవల్సిన మందులు కూడా తప్పని సరిగా వాడుతుండాలి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







