లావెటరిలో కిలో బంగారం!
- May 25, 2016
విమానంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తి కస్టమ్స్ అధికారుల తనిఖీలకు భయపడి కిలో బంగారాన్ని విమానంలోని మరుగుదొడ్డిలో దాచి ఉంచాడు. విమాన సిబ్బంది చాకచక్యంగా తనిఖీలు నిర్వహించడంతో అతగాడి బండారం బయటపడింది.వివరాల్లోకి వెళ్తే.. గురువారం దుబాయ్ నుంచి కొచ్చికి చేరుకున్న స్పైస్ జెట్ విమానంలో ఓ ప్రయాణికుడు అనుమానాస్పదంగా పలుమార్లు విమానంలోని మరుగుదొడ్డి(లావెటరి)కి వెళ్లడం గమనించిన విమానసిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో లావెట్రీలోని టిష్యూ పేపర్ బాక్స్ వెనుకాల పేపర్ లో చుట్టి దాచి ఉంచిన కిలో బంగారు కడ్డీలను సిబ్బంది కనిపెట్టారు. బంగారాన్ని స్వాధీనం చేసుకొని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







