'మజెంటా' పేరుతో జూన్ 1న ..
- May 25, 2016
ఇంటర్నెట్ సేవల్లో అగ్రగామిగా ఉన్న గూగుల్.. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో అద్భుతాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మనుషులు చేసే పనులను కృత్రిమ మేధస్సుతో చేయించే సాంకేతికతను అభివృద్ధి చేసే పనిలో నిమగ్నమైంది. 2011 నుంచి గూగుల్ 'బ్రెయిన్' ప్రాజెక్టులో భాగంగా పరిశోధకులు ఏఐ మెషీన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ తనంతట తానే వినసొంపైన సంగీత స్వరాలు పలికిస్తూ.. అందమైన పెయింటింగ్స్ వేసే కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు. 'మజెంటా' పేరుతో జూన్ 1న ఈ ప్రాజెక్ట్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అప్లికేషన్ రూపంలో ఉండే మజెంటాను ఎవరైనా వాడుకోవచ్చట. అది సృష్టించే సంగీతాన్ని వినొచ్చట.
గూగుల్ బ్రెయిన్ బృందం గతేడాది విడుదల చేసిన 'టెన్సార్‌ఫ్లో' మెషీన్ లెర్నింగ్ సాఫ్ట్‌వేర్‌తో మజెంటా పనిచేస్తుందట. పాటలను అప్‌లోడ్ చేస్తే.. వాటిని కృత్రిమ మేధస్సుతో విశ్లేషించి మజెంటా సొంతంగా స్వరాలు పలికిస్తుందట. ఇప్పటికే గూగుల్ కొన్ని గంటల నిడివి ఉన్న పాటలను మజెంటాలోకి అప్‌లోడ్ చేసింది. ఎన్ని ఎక్కువ పాటలు అప్‌లోడ్ చేస్తే.. అంత బాగా పనిచేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
సాధారణ గాయకుల్లాగే.. ఈ మెషీన్ కూడా సొంతంగా ఆలోచిస్తుంది. ఈ కృత్రిమ గాయని సృష్టించే స్వరాలతో గూగుల్ ఓ ఆల్బమ్‌ను కూడా విడుదల చేయనుంది. అలాగే.. మనం ఏదైనా చిత్రాన్ని మజెంటాలోకి అప్‌లోడ్ చేస్తే దాన్ని అందంగా తీర్చిదిద్దుతుంది. మనుషుల ప్రమేయం లేకుండానే కంటికి ఇంపైన పెయింటింగ్స్ రూపొందిస్తుందని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







