తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ప్రధాని మోడీ
- November 25, 2023
బెంగుళూరు: ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు బెంగుళూరులో తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డెవలప్ చేసిన తేజస్‌లో ఆయన ట్రిప్ వేశారు. బెంగుళూరులో ఉన్న హెచ్ఏఎల్ కంపెనీని ఆయన విజిట్ చేశారు. రకరకాల ఫైటర్ జెట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. తేజస్ తయారీ గురించి కూడా ఆయన తెలుసుకున్నారు. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ.. తేజస్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్నది. లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌గా వాటికి గుర్తింపు ఉన్నది. అమెరికాకు చెందిన జీఈ ఏరోస్పేస్ సంస్థతో హిందుస్థాన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. తేజస్ విమానాలకు చెందిన మాక్-3 ఇంజిన్లను హెచ్ఏఎల్ ఉత్పత్తి చేస్తోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







