కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
- November 25, 2023
టొరంటో: కెనడా టొరంటో డుర్హం తెలుగు క్లబ్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు కన్నుల పండుగవగా జరిగాయి. డుర్హం తెలుగు క్లబ్ వారు నిర్వహించిన గ్రాండ్ దీపావళి వేడుకలకు 800లకుపైగా తెలుగు కుటుంబాలు హాజరై దీపావళి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలతో, ఆటపాటలతో చిన్నారులు అలరించారు. ప్రముఖ కూచిపూడి నృత్య విద్యాలయ అధినేత సుధా వేమూరి ఆధ్వర్యంలో నిర్వహించిన కూచిపూడి నృత్యాలు అతిధులని అలరించాయి. ప్రత్యేక అతిధులుగా డుర్హం హైద్రాబాదీ అసోసియేషన్ సభ్యులు విచ్చేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. "గెట్ హోమ్ రియాల్టీ " అధినేతలు ఆనంద్ పేరిచర్ల, రమేష్ గోల్లు, రఘు జూలూరి ఈ కార్యక్రమానికి చేయూత అందించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా విత్బ్య్ నగర ఎంపీపీ లాన్ కాయ్ , డిప్యూటీ మేయర్ మలీహా షాహిద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంటర్ ప్రెన్యూర్ అఫ్ ది ఇయర్ గా అవంత్ సోల్యూషన్స్ అధినేత శ్రీనివాస్ వర్మ అట్లూరి ఎంపికయ్యారు. వారికి ఎంపీపీ లానే కాయ్ అవార్డును అందచేసి సత్కరించారు. ఏకో ఫ్రెండ్లీ రోల్ మోడల్ గా సాయి మోహన శర్మ ఎంపిక అయ్యారు. వారికి డీటీసీ కార్య వర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి డుర్హం తెలుగు క్లబ్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, గుత్తిరెడ్డి, డైరెక్టర్స్ రవి మేకల, వెంకట్ చిలువేరు, శ్రీకాంత్ సింగిసేతి, రమేష్ ఉప్పలపాటి, గుణ శేఖర్ రెడ్డి, గౌతమ్ పిడపర్తి, సర్దార్ ఖాన్, వాసు, కమల మూర్తి, యుగి చెరుకూరి, శివ హాజరయ్యారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..