కువైట్లో ఆత్మాహుతి దాడి లో 27 మంది మృతి

- June 27, 2015 , by Maagulf
కువైట్లో ఆత్మాహుతి దాడి లో 27 మంది మృతి

కువైట్ రాజధానిలో నిన్న జరిగిన ఆత్మాహుతి దాడిలో 27 మంది భక్తులు మరణించారు. ఈ ఘటనకు తీవ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క అనుబంధ సంస్థ ఐన నాజ్డ్ ప్రావిన్స్ సభ్యుడు - అబూ సులైమాన్ అల్ మువహ్హిద్ అనే వ్యక్తి కారణమని తెలియవచ్చింది. ఇతడు, గ్యాస్ కానిస్టార్ లను కలిగియున్న గోడౌన్ ను, డెలివరీ వేన్ తో ఢీకొనటం వలన మొదటి విస్ఫోటనం సంభవించింది. అనంతరం అతడు ఆ కానిస్టార్ లను తెరవాడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అరస్టు చేశారు. ఈ ఘటనను, తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ, కువైట్ కు బహ్రైన్ మద్దతు ప్రకటించింది. కువైట్ కాబినెట్, ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి, రక్షకదళాలను, పోలీసు వారిని అప్రమత్తం చేసి, నేడుసంతాప దినంగా ప్రకటించింది.

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్  ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com