భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మలేషియా
- November 27, 2023
డిసెంబర్ 1 నుంచి భారత్ నుంచి వచ్చే సందర్శకులకు 30 రోజుల వీసా రహిత ప్రయాణాన్ని అనుమతిస్తామని మలేషియా ఆదివారం తెలిపింది. శ్రీలంక మరియు థాయ్‌లాండ్ తర్వాత భారతీయ పౌరులకు వీసా రహిత ప్రయాణాన్ని అనుమతించిన మూడవ ఆసియా దేశంగా మలేషియా నిలిచింది. ప్రస్తుతం సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, టర్కీ మరియు జోర్డాన్ నుండి వచ్చే ప్రయాణికులు వీసా మినహాయింపును పొందుతున్నారు. అయితే వీసా మినహాయింపు సెక్యూరిటీ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని ఆదేశ ప్రధాని చెప్పారు. నేర చరిత్ర, హింసాత్మక ప్రమాదం ఉన్నవారికి వీసా లభించదని ఆయన తెలిపారు. 2022లో RM 86.22 బిలియన్ల (USD 19.63 బిలియన్లు) మొత్తం వాణిజ్యంతో భారతదేశం మలేషియా 11వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. ఇది 2021లో నమోదైన విలువతో పోలిస్తే 23.6 శాతం పెరిగింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!