ఒమన్‌కు భారతదేశం కీలకమైన ట్రావెల్ మార్కెట్
- November 27, 2023
మస్కట్: భారతదేశంలో తన కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు మరియు విస్తరించేందుకు సలామ్ ఎయిర్ ఇటీవలి ప్రకటన ఒమన్‌లోని ప్రవాస భారతీయులలో ఉత్సాహాన్ని నింపింది. డిసెంబర్ 16 నుండి హైదరాబాద్, లక్నో, త్రివేండ్రం, కాలికట్ మరియు జైపూర్‌తో సహా భారతీయ ముఖ్య నగరాలకు డైరెక్ట్ విమానాలను నడుపనుంది. ఈ కొత్త గమ్యస్థానాల గురించి ఎయిర్‌లైన్ యాక్టింగ్ సీఈఓ, కెప్టెన్ అహ్మద్ అల్ షిధానీ వివరించారు. సలామ్ ఎయిర్‌కు భారతదేశం ఒక కీలకమైన మార్కెట్ అని కెప్టెన్ తెలిపారు. ఒమన్ మరియు GCC ప్రాంతంలో గణనీయమైన సంఖ్యలో భారతీయ ప్రవాసు ఉన్నారని, ఈ కమ్యూనిటీలకు మద్దతు ఇవ్వడం, సాంస్కృతిక మరియు వ్యాపార మార్పిడిని పెంపొందించడంలో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీ ప్రభావాన్ని చూపుతుందని ఒక ఇంటర్వ్యూలో అల్ షిధాని పేర్కొన్నారు. ప్రయాణీకులకు మరిన్ని ప్రయాణ ఎంపికలను అందించడం, ఈ ప్రాంతంలో ట్రావెల్ హబ్‌గా ఒమన్ స్థానాన్ని బలోపేతం చేయడంలో ఈ కొత్త మార్గాలు కీలక భూమికి వహిస్తాయని వివరించారు. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతోపాటు ఒమన్ పర్యాటక పరిశ్రమకు గణనీయంగా దోహదపడతాయన్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!