‘హరి హర వీరమల్లు’ గుట్టు రట్టయిపోయిందిగా.!
- November 28, 2023
పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ‘హరి హరవీరమల్లు’. ఈ సినిమా షూటింగ్ చాలా ఘనంగా స్టార్ట్ చేశారు. మొగలుల చరిత్రగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందబోయే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొన్ని ప్రత్యేకమైన యుద్ధ విద్యల్లో సైతం శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.
టీజర్ రిలీజ్ చేసి సినిమాపై బజ్ క్రియేట్ చేశారు కూడా. కానీ, ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ, ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని ప్రచారం జరిగింది. క్రిష్‌కీ పవన్ కళ్యాణ్‌కీ మధ్య ఏదో కిరికిరి నడిచిందనీ అందుకే సినిమా షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారం కూడా వుంది.
అయితే, అలాంటిదేం లేదు.. ‘ఓజీ’ తదితర సినిమాలతో పాటూ, ‘హరి హర వీరమల్లు’ సినిమా కూడా షూటింగ్ జరుగుతోందని ఆ మధ్య చిత్ర యూనిట్ ప్రచారాల్ని ఖండించింది.
కానీ, తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న నటుడు ఆ విషయంపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన మరెవరో కాదు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్. ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్న బాబీ డియోల్ తాజాగా ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ మాట నోరు జారేశారు.
‘యానిమల్’ కన్నా ముందే తాను ఓ తెలుగు సినిమా ఒప్పుకున్నాననీ కానీ, దురదృష్టవశాత్తూ ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందనీ ఆయన టంగ్ స్లిప్ అయ్యారు. సో, అలా ‘హరి హరవీరమల్లు’ గుట్టు రట్టయిపోయింది.
ఈ సినిమాలో బాబీ డియోల్ ఔరంగజేబు పాత్ర పోషించాల్సి వుంది. మరి, అన్నీ కుదిరి, ఈ సినిమా మళ్లీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో.. ఎప్పటికి రిలీజ్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







