‘యానిమల్’ గురించి మహేష్ గట్టిగా చెప్పేశాడే.!

- November 28, 2023 , by Maagulf
‘యానిమల్’ గురించి మహేష్ గట్టిగా చెప్పేశాడే.!

బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ బాబు కాస్త ఎక్కువే మాట్లాడేశాడు. మహేష్ మామూలుగానే తన సినిమా ఫంక్షన్లలోనే చాలా తక్కువ మాట్లాడతాడు. అలాంటిది ‘యానిమల్’ గురించి చాలా చాలా ఎక్కువ చెప్పేశాడని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.

ప్రీ రిలీజ్ ఫంక్షన్ ముందు రోజే డైరెక్టర్ సందీప రెడ్డి వంగా తనను సంప్రదించాడనీ, అడిగిన వెంటనే ఓకే చెప్పేశాననీ మహేష్ తెలిపాడు. అన్నింటికీ మించి రణ్‌బీర్ కపూర్‌కి తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పుకున్నాడు మహేష్ బాబు.

ఇప్పటికే ‘యానిమల్’ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మహేష్ రాకతో ఆ అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. సినిమాకి వర్క్ చేసిన ప్రతీ ఒక్కరినీ మహేష్ ఎంతో ఆప్యాయంగా గుర్తు చేస్తూ పేరు పేరునా వారి గొప్పతనాన్ని అభివర్ణించడం నిజంగా చాలా బాగుంది.

ఇక, ‘యానిమల్’ విషయానికి వస్తే, ప్రచార చిత్రాలన్నీ టాప్ రేంజ్‌లో వున్నాయ్. సినిమాలో ‘అర్జున్ రెడ్డి’ ఫ్లేవర్ బాగా కనిపిస్తున్నప్పటికీ తండ్రి సెంటిమెంట్.. ఆ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపించడం ఈ సినిమాకి మంచి అస్సెట్.

డిశంబర్ 1న వరల్డ్ వైడ్‌గా ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచార చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా అలవాటైపోయాడు రణ్‌బీర్ కపూర్. ఇక కంటెంట్ కనుక కన్విన్సింగ్‌గా వున్నట్లయితే, టాలీవుడ్ బాక్సాఫీస్ ‘యానిమల్’కి దాసోహం అనాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com