ఓటర్లకు ముఖ్య గమనిక..

- November 28, 2023 , by Maagulf
ఓటర్లకు ముఖ్య గమనిక..

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మేధావులు పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పౌరులు కూడా సిద్ధమవుతున్నారు. అయితే, ఓటర్లకు ముఖ్య గమనిక. ఓటు వేసే వారు కొన్ని కీలక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని విషయాల పట్ల అవగాహన ఏర్పరచుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు.

ముందుగా ఓటర్లు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది? అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే.. తమకు కేటాయించిన పోలింగ్ బూత్ లోనే ఓటర్లు ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే, పోలింగ్ బూత్ ఎక్కడుంది అనేది తెలుసుకోవడం అవసరం. చేతిలో కేవలం ఓటర్ కార్డు ఉంటే సరిపోదు. ఓటర్ కార్డు ఉంది ఇక ఓటు వేసేయొచ్చు అనుకుంటే పొరపాటే అవుతుంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్ కార్డు మాత్రమే ఉంటే సరిపోదు. కచ్చితంగా పోలింగ్ స్టేషన్ కు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే మీ పోలింగ్ బూత్ ఏదో తెలుసుకోవాల్సిందే. మరి మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది? అని తెలుసుకోవడం ఎలా? అంటే.. దానికొక మార్గం ఉంది.

పోలింగ్ స్టేషన్‌ను కనుక్కోవడం ఇలా..

  • పోలింగ్ స్టేషన్ ను ఎలా కేటాయిస్తారు అంటే.. ఓటర్ యొక్క రెసిడెన్షియల్ అడ్రస్ మీద ఆధారపడి ఉంటుంది.
  • నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ను(https://voters.eci.gov.in/) ఓపెన్ చేయాలి.
  • Search In Electoral Roll (https://electoralsearch.eci.gov.in/) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ అవసరమైన డీటైల్స్ ఇవ్వాలి. (అంటే.. పేరు, తండ్రి పేరు, వయసు, లింగం, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం). ఈ వివరాలు సమర్పించాలి.
  • ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడానికి సెర్చ్ బటన్ పై క్లిక్ చేయాలి.
  • అంతే.. మీ పోలింగ్ స్టేషన్ అడ్రస్ కనిపిస్తుంది. దాంతో పాటు సీరియల్ నెంబర్ ఉంటుంది.

ఇలా కూడా మీ పోలింగ్ స్టేషన్ ఏదో తెలుసుకోవచ్చు..

  • నేషనల్ ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్ ను(https://voters.eci.gov.in/) ఓపెన్ చేయాలి.
  • Know Your Polling Station (https://electoralsearch.eci.gov.in/pollingstation) మీద క్లిక్ చేయాలి.
  • ఆ తర్వాత ఎపిక్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అంతే, మీ పోలింగ్ బూత్ అడ్రస్ మీకు కనిపిస్తుంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com