సొరంగంలోని కార్మికులను కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా

- November 29, 2023 , by Maagulf
సొరంగంలోని కార్మికులను కాపాడిన సిబ్బందికి ధన్యవాదాలు: ఆనంద్ మహీంద్రా

న్యూఢిల్లీ: ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంపై దేశవ్యాప్తంగా సంబరం వెల్లివిరుస్తోంది. కార్మికులను కాపాడేందుకు తలపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు.

‘‘ఇది కృతజ్ఞత తెలపాల్సిన సమయం. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మందిని కాపాడేందుకు 17 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని మీరు దేశప్రజలకు అందించారు. ఆశలు సాకారం చేశారు. అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, బయటపడలేనంత లోతైన సొరంగం ఏదీ ఉండదని మీరు నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు. నెటిజన్లు కూడా ఆనంద్ మహీంద్రాతో ఏకీభవించారు. కార్మికుల కళ్లల్లో ఆనందం చూస్తుంటే కడుపు నిండిపోయిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com