స్కిల్ డెవలప్ మెంట్ కేసు..పిటిషన్ పై విచారణ వాయిదా!

- November 29, 2023 , by Maagulf
స్కిల్ డెవలప్ మెంట్ కేసు..పిటిషన్ పై విచారణ వాయిదా!

అమరావతి: స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు కూడా నిన్న ఆయనకు స్వేచ్ఛను ప్రసాదించింది. మరోవైపు, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పజెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే.

ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ కేసులో కొందరికి మాత్రమే నోటీసులు అందాయని… మరికొందరికి అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని, మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి వారికి చేరలేదని కోర్టుకు రిజిస్ట్రార్ తెలిపారు. వీరికి పర్సనల్ గా నోటీసులు ఇచ్చేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com