తిరుపతిలో ఐఐటి ఏర్పాటుకు లైన్ క్లియర్
- May 26, 2016
దేశంలో అత్యన్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటీ ల స్థాపనను మరింతగా విస్తరించి భారత్ లో తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే మోడీ సంకల్పం అమల్లోకి రానుంది. దేశ వ్యాప్తంగా ఐఐటీ లా ఏర్పాటు ద్వారా మరింతగా సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకోవడమే కాకుండా దేశాన్ని అభివ్రుది పథంలోకి పయనింపజేయవచ్చని సంకల్పించిన ప్రధాని ఆ దిశగా అడుగులు వేశారు. దీంతో మారింత మంది విద్యార్థులకు ఈ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో విద్యను అభ్యసించే అవకాశం ఏర్పడింది. మోడీ ఆలోచనా విధానం పట్ల ఉన్నత విద్యావంతులు, సాంఘిక సంస్కర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-తిరుపతి), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)ల ఏర్పాటుకు బుధవారం కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తిరుపతి సహా పాలక్కడ్, ధార్వాడ్, భిలాయ్, గోవా, జమ్మూల్లో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లను 'ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-1961'లో చేర్చడానికి అనువుగా ఈ చట్టాన్ని సవరించే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఐండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్ఎమ్) ధన్‌బాద్‌ను ఐఐటీగా స్థాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2001 ప్రకారం రిజిస్టర్ అయిన ఏపీలోని ఎన్ఐటీ(నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటుకు సంబంధించిన(పశ్చిమగోదావరి జిల్లాలో తాత్కాలిక క్యాంపస్ ఏర్పాటైంది) సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









