‘యానిమల్’తో నాని.! ప్రమోషన్లు మామూలుగా లేవ్గా.!
- November 29, 2023
ఈ డిశంబర్కి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోరుకు తలపడబోతున్నాయ్. ఒక వారం నాది, ఇంకో వారం నీది.. అంటూ పంచుకుని ఫ్రెండ్లీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయ్.
అవే, ‘యానిమల్’ ఒకటి, ‘హాయ్ నాన్న’ ఇంకోటి. ఈ రెండు సినిమాలూ నాన్న సెంటిమెంట్‌తో తెరకెక్కినవే. కానీ, కథ, కథాంశం వేరు అంతే.
ప్రమోషన్లు, అంచనాలు కూడా ఈ రెండు సినిమాలకు పోటీగానే వున్నాయ్. డిశంబర్ 1న ‘యానిమల్’ వస్తోంది. నిజానికి బాలీవుడ్ సినిమానే అయినా డైరెక్ట్ తెలుగు సినిమా మాదిరి ఈ సినిమా ప్రమోట్ అయ్యిందింతవరకూ.
రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా తెరకెక్కిన ఈ సినిమాని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. అలాగే నాని నటించిన ‘హాయ్ నాన్న’కు శ్రీకాంత్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కించాడు.
తాజాగా ప్రమోషన్లలో భాగంగా నాని, సందీప్ రెడ్డి వంగా కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నానిని సందీప్ రెడ్డి, సందీప్ రెడ్డిని నాని ఇంటర్వ్యూ చేసుకున్నారు. మీ సినిమా లెంగ్త్ ఎంత.? అని సందీప్, నానిని అడగ్గా.. మీ కన్నా ఒక గంట తక్కువే అని చెప్పాడు.
అలాగే, సినిమాలో తల్లి పాత్ర చనిపోతుందా.? అని అడిగితే అది రిలీజ్ తర్వాతే తెలుస్తుంది అని నాని తనదైన చతురతో సమాధానమిచ్చాడు.
అలాగే, సందీప్ రెడ్డిని కూడా నాని ‘యానిమల్’ సినిమా గురించి కొన్ని ప్రశ్నలడుగుతూ ఇంటర్వ్యూని ఆసక్తికరంగా నడిపించారు. హెల్దీ వాతావరణంలో ఇన్నోవేటివ్‌గా సాగిన ఈ ఇంటర్వ్యూ ఫ్యాన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల ఫైనల్ రిజల్ట్ ఎలా వుండబోతోందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.!
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త..
- ఆహార భద్రతా వ్యవస్థను సమీక్షించిన మినిస్టర్ టీమ్..!!
- అల్ సహ్లా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రవాసులు మృతి..!!
- ఫేక్ బ్రాండెడ్ గూడ్స్..మనీలాండరింగ్.. Dh1-మిలియన్ ఫైన్, ఏడాది జైలు..!!
- భద్రతా పరమైన సంఘటనల వీడియోలు తీయవద్దు..!!
- సయ్యద్ ఫహద్ మరణం పై పలు దేశాలు సంతాపం..!!
- మదీనాలో చిన్నారిని చంపిన ఫిలిప్పీన్స్ వర్కర్ అరెస్ట్..!!
- 45 మందిని అరెస్టు చేసిన అబుదాబి పోలీసులు..!!
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు









