బాలయ్య మారిపోయాడు.!

- November 29, 2023 , by Maagulf
బాలయ్య మారిపోయాడు.!

మార్పు మంచిదే.. బాలయ్య విషయంలోనూ ఆ మంచి జరిగిందండోయ్. సహజంగా ఎవరు చెప్పినా వినడు బాలయ్య అంటుంటారు. ఆయన ఆటిట్యూడ్.. దాదాపు అందరికీ తెలిసిందే. షూటింగ్ సమయంలోనూ ఆయనతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కొందరు అంటుంటారు.

అయితే, అనిల్ రావిపూడి బాలయ్యను మార్చేశాడనుకోవాలేమో. ఇటీవల వచ్చిన ‘భగవంత్ కేసరి’ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టేసిందని చెప్పలేం కానీ, ఓకే బాగుంది. ఇక ఓటీటీ ప్రేక్షకుల్ని అయితే ఇంకా బాగా అలరిస్తోందీ ఈ సినిమా.

ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బాలయ్య సినిమాల్లో అతి కాస్త ఎక్కువ అభిప్రాయాలు సహజంగా వుంటాయ్. కానీ, ‘భగవంత్ కేసరి’లో బాలయ్య చాలా బ్యాలెన్స్‌డ్‌గా చేశారు.

అంతలా బాలయ్య ఎలా మౌల్డ్ అయ్యారనే అనుమానాలు రాకపోవు ‘భగవంత్ కేసరి’ సినిమా చూస్తున్నంత సేపు. ఈ సినిమాలో బాలయ్యను చూశాకా, ఆయనపై మరింత అభిమానం పెరిగింది. ఇక, బాబీ డైరెక్షన్‌లో ఆయన చేయబోయే సినిమాపై అంచనాలు కూడా బాగా పెరిగాయ్.

‘వాల్తేర్ వీరయ్య’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ బ్యాక్ డ్రాప్ వుంది బాబీకి. బాలయ్యతో ఎలాంటి సంచలనాలకు తెర లేపుతాడో చూడాలిక.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com