ఓట్ల పండగ.! తెలంగాణలో ఓట్లేసిన సినీ ప్రముఖులు.!
- November 30, 2023
తెలుగు సినీ ప్రముఖుల్లో చాలామందికి ఓటు హక్కు తెలంగాణలోనే వుంది. అదీ, హైద్రాబాద్‌లో.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో సినీ ప్రముఖులు సందడి చేశారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, యంగ్ టైగర్ ఎన్టీయార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదితరులు ఇప్పటికే తమ ఓటు హక్కుని వినియోగించారు. కుటుంబ సమేతంగా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాల వద్ద సందడి చేయడంతో, వారిని చూసేందుకు జనం ఎగబడ్డారు. మీడియా హడావిడి మామూలే.
‘మీరు ఇక్కడే కవరేజ్‌లో వుండిపోతే, ఓట్లెలా వెయ్యడం.?’ అని జూనియర్ ఎన్టీయార్, మీడియాని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘సగం మంది ఓటెయ్యలేరు..’ అని కొందరు మీడియా ప్రతినిథులు చెప్పడం గమనార్హం.
కాగా, ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలు కాగా, పోలింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో బారుల తీరారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంటే, తెలంగాణలో తొలిసారి అధికార పీఠమెక్కుతామని కాంగ్రెస్ అంటోంది. బీజేపీ కూడా, తొలిసారి తమకు అవకాశం దక్కుతుందని అంటోంది.
తెలంగాణలో బోణీ కొట్టాలనుకుంటోంది జనసేన పార్టీ.! ఆయా పార్టీల అంచనాలెలా వున్నా, ఓటరు మదిలో ఏముందన్నది డిసెంబర్ 3న తేలుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







