యూఏఈ జాతీయ దినోత్సవం.. మారిన మెట్రో, ట్రామ్ టైమింగ్స్

- December 01, 2023 , by Maagulf
యూఏఈ జాతీయ దినోత్సవం.. మారిన మెట్రో, ట్రామ్ టైమింగ్స్

యూఏఈ: యూఏఈ యూనియన్ డే హాలిడే కోసం దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఉచిత పబ్లిక్ పార్కింగ్ ప్రకటించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 4 వరకు పార్కింగ్ ఉచితంగా ఉంటుందని అధికార యంత్రాంగం తెలిపింది. మల్టీ లెవల్ టెర్మినల్స్ మినహా అన్ని పబ్లిక్ పార్కింగ్‌లకు ఇది వర్తిస్తుంది. పార్కింగ్ టారిఫ్ డిసెంబర్ 5న పునఃప్రారంభించబడుతుంది.

అదేవిధంగా RTA అన్ని ఇతర సేవలకు సంబంధించిన వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు, చెల్లింపు పార్కింగ్ జోన్‌లు, పబ్లిక్ బస్సులు, దుబాయ్ మెట్రో మరియు ట్రామ్, సముద్ర రవాణా సాధనాలు మరియు సర్వీస్ ప్రొవైడర్ సెంటర్‌లకు (వాహనాల సాంకేతిక తనిఖీ) వర్తిస్తుందని పేర్కొంది.

సర్వీస్ ప్రొవైడర్ కేంద్రాలు (వాహన పరీక్ష)
డిసెంబర్ 2 నుండి ప్రారంభమయ్యే సెలవు రోజుల్లో సర్వీస్ ప్రొవైడర్ సెంటర్‌లు మూసివేయబడతాయి. వాహనాల సాంకేతిక తనిఖీ సేవలు మాత్రమే డిసెంబర్ 4 నాడు పునఃప్రారంభించబడతాయి. డిసెంబర్ 5 నుంచి అన్ని కేంద్రాలు పునఃప్రారంభమవుతాయి.

కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్లు
సెలవుదినాలలో ఈ కేంద్రాలు మూసివేయబడతాయి. ఉమ్ రామూల్, దీరా, అల్ బర్షా, అల్ కిఫాఫ్ మరియు RTA ప్రధాన కార్యాలయంలలో స్మార్ట్ కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌లు 24 గంటలూ యధావిధిగా పనిచేస్తాయి.

దుబాయ్ మెట్రో
నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు రెడ్, గ్రీన్ లైన్లు ఉదయం 5 నుండి 1 గంటల వరకు (మరుసటి రోజు) వరకు పనిచేస్తాయి.

దుబాయ్ ట్రామ్
నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు ట్రామ్ ఉదయం 6 నుండి మరుసటి రోజు 1 గంటల వరకు మరియు ఆదివారం ఉదయం 9 నుండి ఉదయం 1 గంటల వరకు (మరుసటి రోజు) సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

పబ్లిక్ బస్సులు
డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 3 వరకు ఉదయం 6.30 నుండి 11 గంటల వరకు 10, 15, 21, 7, 8, 83, 91, E101, 98E, 96, 95A, 95, 91A , X94, X92, E102 బస్సు మార్గాలు షేక్ జాయెద్ రోడ్ (అబుదాబి వైపు మాత్రమే) మళ్లించబడతాయి. ఈ రూట్లలో బస్సు సేవలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కొన్ని ట్రిప్పులు రద్దు చేయవచ్చు.  

సోమవారాలు నుండి గురువారం వరకు ఉదయం 4.30 నుండి 12.30 వరకు (మరుసటి రోజు), శుక్రవారాలు ఉదయం 5 నుండి 12.30 వరకు (మరుసటి రోజు), శని మరియు ఆదివారాలు ఉదయం 6 నుండి ఉదయం 1 గంటల వరకు (మరుసటి రోజు) మెట్రో లింక్ బస్ సర్వీస్ సర్వీస్ టైమింగ్ మెట్రో ఆపరేటింగ్ టైమ్‌లు,  ట్రిప్‌లతో సింక్రొనైజ్ చేయబడుతుంది.        

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com