హర్షవర్థన్ దర్శకత్వం వైపు అడుగు..
- May 26, 2016తెలుగు సినిమా ఇండస్ట్రిలో హాస్యనటులు దర్శకులుగా మారడం చూస్తూనే ఉన్నాం. ఏవీఎస్, ధర్మవరపు, ఎమ్మెస్ నారాయణ.. దర్శకులుగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. వెన్నెల కిషోర్ కూడా మెగాఫోన్పట్టిన వాడే. ఇప్పుడు కొత్తగా మరో హాస్యనటుడు కెప్టెన్ కుర్చీలో కూర్చుంటున్నాడు. తనే హర్షవర్థన్. అమృతం సీరియల్‌తో పాపులర్ అయిన హర్షవర్థన్.. కొన్ని సినిమాల్లో రాణించాడు. రచయతగానూ నిరూపించుకొన్నాడు. ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. రామాయణం పేరుతో ఓ కథ సిద్ధం చేసుకొన్న హర్షవర్థన్.. ఓ నిర్మాతని పట్టేశాడట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందని టాక్. రామాయణం అనే పేరున్నా ఇది మైథలాజికల్ సబ్జెక్ట్ కాదని, ఈతరం ప్రేమకథే అని తెలుస్తోంది. హ్యూమర్, ఎమోషనల్ టచ్‌తో సాగే ఈ సినిమా కోసం ప్రస్తుతం నటీనటుల్ని ఎంపిక చేసుకొంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే. ప్రకాష్‌రాజ్ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మన ఊరి రామాయాణం అనే టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల టైటిళ్లు క్లాష్ అయ్యే ప్రమాదం ఉంది
తాజా వార్తలు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి
- బీచ్‌లో ప్రమాదకరమైన ప్రవాహాలు..నివాసితులకు వార్నింగ్
- ప్రశాంతంగా పోలింగ్…ప్రతీక్షణం మానిటరింగ్ చేశాం: డీజీపీ రవి గుప్తా
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు