నాలుగో టీ20లో భారత్ విజయం..
- December 02, 2023
రాయ్‌పుర్: మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. రాయ్‌పుర్ లోని షాహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20 మ్యాచులో 20 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో భారత్ 3-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. నామమాత్రమైన చివరి టీ20 మ్యాచ్ ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లో ఏడు వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లో మాథ్యూ వేడ్ (36 నాటౌట్; 23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), ట్రావిస్ హెడ్ (31; 16 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), లు రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో ఆసీస్‌కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీశాడు. దీపర్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవిబిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ చెరో వికెట్ సాధించారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో రింకూ సింగ్ (46; 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (37; 28 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్), జితేశ్ శర్మ (35; 19 బంతుల్లో 1 ఫోర్, 3సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (32; 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వారిషుస్ మూడు వికెట్లు తీశాడు. తన్వీర్ సంఘ, జాసన్ బెహ్రెండోర్ఫ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆరోన్ హార్డీ ఓ వికెట్ సాధించాడు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







