జాతీయ దినోత్సవ సెలవులలో వర్షం కురుస్తుందా?
- December 02, 2023
యూఏఈ: జాతీయ దినోత్సవ సెలవులలో యూఏఈ నివాసితులు విహారయాత్రలను ప్లాన్ చేయడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నవంబర్ ప్రారంభంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన తర్వాత, దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే, డిసెంబర్ 2న కొన్ని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం ఉండే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటిరియాలజీ తెలిపింది. అలాగే కొన్ని తీర ప్రాంతాలలో పొగమంచు ఏర్పడి రాత్రికి తేమగా ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు కూడా వీస్తాయి.
డిసెంబరు 3న కూడా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కాబట్టి, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటుంది. తేలికపాటి నుండి మోస్తరు గాలులు వీస్తాయి. డిసెంబర్ 4న కొన్ని పశ్చిమ తీర ప్రాంతాలు, ద్వీపాలలో సాధారణంగా పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ వారి దీర్ఘ వారాంతానికి వాతావరణ సూచన ఆహ్లాదకరమైన గాలులతో ఉంటుందని, వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







