దీంతో జూన్‌ తొమ్మిదిన 'కబాలి' ఆడియో విడుదల

- May 26, 2016 , by Maagulf
దీంతో జూన్‌ తొమ్మిదిన  'కబాలి' ఆడియో విడుదల

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న 'కబాలి' చిత్రం విడుదల తేదీ దగ్గరపడేకొద్దీ ఆయన అభిమానుల్లో 'కబాలి ఫీవర్‌' పెరిగిపోతూనే ఉంది. మలేషియా, సింగపూర్‌ వంటి దేశాల్లో అయితే ఇదివరకు లేనంతస్థాయిలో అభిమానులు ఉత్సాహంగా కనిపిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో మాదిరిగా, 'కబాలి' టీషర్టులు, కార్లపై పెద్దస్టిక్కర్లు, ఫ్లెక్సీలు.. ఇలా తమ అభిమానాన్ని మరింత చాటుకుంటున్నారు. ఇక తమిళనాడులో అయితే ఆ అభిమానానికి హద్దుల్లేవు. ఇటీవల విడుదలైన టీజర్‌ ఏకంగా హాలీవుడ్‌ చిత్రాల టీజర్ల స్థాయిని కూడా దాటిపోతుండటంతో.. రజనీకాంత్‌ పంచ్‌పవర్‌ ఏంటో తెలుస్తోంది. 'కబాలి..డా...' అంటూ రజనీ తనదైనశైలిలో చెప్పిన మాటలకు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. దీంతో పాటలు, సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ప్రస్తుతం పాటల విడుదల కోసం సన్నాహాలు సాగిస్తోంది చిత్రయూనిట్‌. దీనిపై నిర్మాత థాను స్పందిస్తూ.. కబాలి చిత్ర ఆడియోను జూన్‌ 15వ తేదీలోపు ముగించేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం ఆ దిశగానే పనులు సాగుతున్నాయి. దీంతో జూన్‌ తొమ్మిదిన ఆడియో విడుదల కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నాం. అందరూ సంతోషపడేలా ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పాటల విడుదల వేడుకను చెన్నైలోని వైఎంసీఏ మైదానంలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అభిమానుల కోరిక మేరకే ఈ కార్యక్రమాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించాలని థాను అనుకున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్‌ అభిమానుల్లో థాను ఒకరు. రజనీకి సూపర్‌స్టార్‌ అన్న పేరును నామకరణం చేసింది కూడా థానునే కావడం విశేషం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com