వాట్సాప్: త్వరలో కొత్త అడ్మిన్లను కూడా ఇన్వైట్ చేయొచ్చు!

- December 03, 2023 , by Maagulf
వాట్సాప్: త్వరలో కొత్త అడ్మిన్లను కూడా ఇన్వైట్ చేయొచ్చు!

 ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. త్వరలో ఛానల్ యజమానులు కొత్త అడ్మిన్‌లను ఆహ్వానించడానికి అనుమతిస్తుంది. కొత్త అడ్మిన్‌లను ఆహ్వానించడానికి ఛానెల్ యజమానులను అనుమతించే ఫీచర్ టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి (iOS) కోసం వాట్సాప్ బీటా లేటెస్ట్ వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే కొంతమంది బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది.

నివేదిక ప్రకారం.. ఛానల్ యజమానులు తమ ఛానల్‌లకు కొత్త అడ్మిన్‌లను యాడ్ చేసేందుకు మెటా-యాజమాన్య యాప్ ఒక ఫీచర్‌పై పని చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్ ఛానల్ యజమానులకు అధునాతన అడ్మిన్ కంట్రోల్, మెరుగైన సామర్థ్యాలను రూపొందించింది.

టెస్ట్‌ఫ్లయిట్ యాప్‌లో అందుబాటులో ఉన్న ఐఓఎస్ 23.25.10.70 అప్‌డేట్ కోసం లేటెస్ట్ వాట్సాప్ బీటాను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని బీటా టెస్టర్‌లకు ఛానల్‌లకు కొత్త అడ్మిన్‌లను ఆహ్వానించే సామర్థ్యాన్ని వాట్సాప్ ఇప్పుడు అందుబాటులోకి తెస్తోందని నివేదిక పేర్కొంది.

15 మంది కాంటాక్టుల వరకు అడ్మిన్ ఇన్విటేషన్:
కొంతమంది బీటా టెస్టర్‌లు ఛానల్ సమాచార స్క్రీన్‌లో కొత్త ‘ఇన్వైట్ అడ్మిన్‌లు’ ఫీచర్‌తో ప్రయోగాలు చేయవచ్చునని స్క్రీన్‌షాట్ వెల్లడించింది. వాట్సాప్ ఛానల్ యజమానులు తమ ఛానల్‌ల కోసం ఎంచుకున్న కాంటాక్టులకు అడ్మిన్ అధికారాలను కేటాయించడానికి అనుమతిస్తుంది. అలాగే 15 మంది కాంటాక్టుల వరకు అడ్మిన్లుగా ఆహ్వానించవచ్చు.

ఛానల్ అడ్మిన్లకు ఫుల్ పవర్స్:
నివేదిక ప్రకారం.. ఛానల్‌కు అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ పొందే ముందు కాంటాక్టుల్లో తప్పనిసరిగా ఆహ్వానాన్ని అంగీకరించాలి. ఆహ్వానం అంగీకరించిన వారు పేరు, ఐకాన్, డిస్ర్కిప్షన్ సహా అవసరమైన ఛానల్ వివరాలను ఎడిట్ చేయవచ్చు. అదనంగా, ఛానల్ అడ్మిన్లు ఛానల్ సెట్టింగ్‌లను ఎడిట్ చేయగలరు. ఛానల్‌లోని రియాక్షన్లకు ఏ ఎమోజీలు అనుమతించాలో కూడా కంట్రోల్ చేయొచ్చు.

ఈ కొత్త అప్‌డేట్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను మాత్రమే కాకుండా ఛానల్ కోసం కంటెంట్‌ను కూడా అడ్మిన్‌లు రూపొందించవచ్చు. ఎడిట్ చేయడం లేదా డిలీట్ చేయడం ద్వారా అడ్మిన్‌లు వారి సొంత లేదా ఇతర అడ్మిన్లు షేర్ చేసిన అప్‌డేట్‌లను పర్యవేక్షిస్తూ కంటెంట్‌ను క్రియేట్ చేయడంతో పాటు షేరింగ్ చేయవచ్చు. ఇతర అడ్మిన్లను యాడ్ చేయడం లేదా రిమూవ్ చేయడం వంటి మొత్తం ఛానల్‌ని డిలీట్ చేయకుండా పరిమితి విధించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com