బెంగళూరులో భారత్ విజయం.. 4-1తో సిరీస్ కైవసం
- December 04, 2023
బెంగళూరు: నామమాత్రమైన ఆఖరి టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. తద్వారా 4-1 తేడాతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచులో భారత్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లో ఎనిమిది వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో బెన్ మెక్‌డెర్మాట్ (54; 36 బంతుల్లో 5 సిక్సర్లు) అర్ధశతకం బాదాడు.
ట్రావిస్ హెడ్ (28), మాథ్యూవేడ్ (22), టిమ్ డేవిడ్ (17)లు ఓ మోస్తరుగా రాణించారు. భారత బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్ చెరో రెండు తీయగా అక్షర్ పటేల్‌లు ఓ వికెట్ సాధించాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ ( 53; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. అక్షర్ పటేల్ (31; 21 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), జితేశ్ శర్మ (24), యశస్వి జైస్వాల్ (21) లు రాణించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డార్వాయిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ లు చెరో రెండు వికెట్లు తీశారు. తన్వీర్ సంఘ, ఆరోన్ హార్డీ, నాథన్ ఎల్లిస్ లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష