యూఏఈలో 17 మంది బిలియనీర్లు
- December 04, 2023
యూఏఈ: UBS బిలియనీర్ ఆంబిషన్స్ రిపోర్ట్ 2023 ప్రకారం.. 2023లో 5 మంది బిలియనీర్లు ఎమిరేట్స్‌కు తమ నివాసాన్ని మార్చారు. UHNWIల సంపద గత రెండు సంవత్సరాలలో అపారంగా పెరిగింది. కీలకమైన వ్యూహాత్మక రంగాలలో(రియల్ ఎస్టేట్, ట్రావెల్ అండ్ టూరిజం, రిటైల్) బలమైన వృద్ధి కారణంగా బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. బిలియనీర్ల మొత్తం సంపద 2023లో 157 శాతం పెరిగి 99.4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది అంతకు ముందు ఏడాది 38.7 బిలియన్ డాలర్లుగా ఉంది. మహమ్మారి తర్వాత దాని ఆర్థిక వ్యవస్థ 2022లో బాగా పెరిగింది, GDP 7.6 శాతం పెరిగింది. గత 10 ఏళ్లలో దాదాపు 1,500 మంది మిలియనీర్లు యూకే నుండి దుబాయ్‌కి మకాం మార్చారని న్యూ వరల్డ్ వెల్త్ వెల్లడించింది. ఈ ఏడాది మరో 250 మంది మకాం మార్చనున్నారు. ఇంతకుముందు విడుదల చేసిన హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం ఈ ఏడాది 4,500 మంది మిలియనీర్లు యూఏఈకి మకాం మార్చనున్నారు. UBS బిలియనీర్ ఆంబిషన్స్ నివేదిక ప్రకారం.. ఇజ్రాయెల్ (26) తర్వాత మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికా (MEA) ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లకు యూఏఈ నిలయంగా ఉంది. ఆ తర్వాత సౌదీ అరేబియా (6), దక్షిణాఫ్రికా (5), ఈజిప్ట్ (4), నైజీరియా (3), లెబనాన్ (2) ఉన్నాయి. MEA ప్రాంతంలో సుమారు 63 మంది బిలియనీర్లు ఉన్నారు. ఏప్రిల్ 6, 2023 వరకు 12 నెలల అధ్యయన వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 7 శాతం పెరిగి, 2,376 నుండి 2,544 వరకు పెరిగిందని అధ్యయనం వెల్లడించింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







