దక్షిణ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్‌ సైన్యం

- December 04, 2023 , by Maagulf
దక్షిణ గాజాలోకి ప్రవేశించిన ఇజ్రాయిల్‌ సైన్యం

గాజా: ఇజ్రాయిల్‌ సైన్యం దక్షిణ గాజాలోకి ప్రవేశించినట్లు ప్రత్యక్ష సాక్షులు సోమవారం పేర్కొన్నారు. గాజాకు దక్షిణాన నిరాశ్రయులైన పాలస్తీనియన్లు ఉంటున్న ఖాన్‌ యునిస్‌ నగరానికి సమీపంలో డజన్ల కొద్దీ ఇజ్రాయిల్‌ యుద్ధ ట్యాంకులు, బుల్డోజర్లు, కారియర్లు, సాయుధ సిబ్బంది ప్రవేశించినట్లు ప్రత్యక్షసాక్షులు మీడియాకు తెలిపారు. గాజాలోని అల్‌-ఖరారా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయిల్‌ యుద్ధ వాహనాలు నిలిచాయని అమిన్‌ అబు (59) మీడియాకు వివరించారు. గాజాస్ట్రిప్‌ ఉత్తర-దక్షిణ ప్రధాన రహదారి సలాహ్  -అల్‌ దిన్‌ రోడ్‌లో ఇజ్రాయిల్‌ ట్యాంకులు నడుస్తున్నాయని మరో వ్యక్తి  తెలిపారు.

ఇజ్రాయిల్‌ ఉత్తర గాజాలోకి సైన్యాన్ని మరియు యుద్ధట్యాంకులను పంపిన కొన్ని వారాల తర్వాత .. పాలస్తీనియన్లను గాజా దక్షిణాన ప్రత్యేకంగా ఖాన్‌ యునిస్‌ ప్రాంతాలకు పారిపోవాలని హెచ్చరిస్తూ ఇజ్రాయిల్‌ సైన్యం కరపత్రాలను జారవిడిచిన సంగతి తెలిసిందే. హమాస్‌ను అణచివేసేంతవరకు  తన గ్రౌండ్‌ ఆపరేషన్‌ను విస్తరిస్తామని  ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ పోర్సెస్‌ ప్రతినిధి డేనియల్‌ హగారి ఆదివారం ప్రకటించారు. హమాస్‌ బలంగా  ఉన్నచోట ఐడిఎఫ్‌ పనిచేస్తుందని అన్నారు.

ఖతార్‌, ఈజిప్ట్‌ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య కుదిరిన ఒప్పందం ముగిసిన వెంటనే గత శుక్రవారం ఇజ్రాయిల్‌ తిరిగి యుద్ధాన్ని ప్రారంభించింది. అప్పటి నుండి దక్షిణ గాజాపై వైమానిక దాడులు తీవ్రమయ్యాయని ఐరాస చిన్నారుల ఏజన్సీ (UNICEF) ప్రతినిధి జేమ్స్‌ ఎల్లర్‌ తెలిపారు. హామీ ఇచ్చినప్పటికీ.. ఉత్తరాదిపై క్రూరమైన దాడులు జరిగినట్లుగానే దక్షిణాదిపై విరుచుకుపడతారని ఆయన గతంలో ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. ఏదేమైనప్పటికీ.. ఇది చిన్నారులు, మహిళలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

ఆదివారం ఒక్కరోజే 10,000కు పైగా వైమానిక దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్‌ సైన్యం ప్రక టించింది. హమాస్‌ ప్రయోగించిన పలు రాకెట్‌ బాంబులను అడ్డుకున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు గాజాలో 15,500 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వారిలో 70 శాతం మహిళలు మరియు చిన్నారులు ఉన్నారని వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com