ఎయిర్ కండిషన్డ్ అబ్రా ప్రారంభం
- May 26, 2016
ఎయిర్ కండిషన్డ్ అబ్రా సర్వీస్ ఇప్పుడు కమ్యూటర్స్కి అందుబాటులోకి రానుంది. రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఈ కొత్త సర్వీసును ఇటీవల ప్రారంభించింది. అలాగే ఆర్టిఎ అల్ జడాఫ్లో కొత్త మెరైన్ స్టేషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్ ద్వారా దుబాయ్ క్రీక్ మెట్రోస్టేషన్‌కి ఈజీ లింక్ ఏర్పడింది. ఎయిర్ కండిషన్డ్ అబ్రాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 20 సీట్లు గల ఈ బోట్లో పనారమిక్ రూఫ్‌తోపాటు, లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించి రూపొందించారు. దీనికి రెండు ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్లను అమర్చారు. 10 మీటర్ల పొడవు 3.4 మీటర్ల వెడల్పుతో వీటిని తయారుచేశారు. అల్ జడాఫ్ స్టేషన్ నుంచి ఫెస్టివల్ సిటీ స్టేషన్ వరకు ఈ ఎయిర్ కండిషన్డ్ ఆబ్రా ఆపరేషన్స్ కొనసాగుతాయి. ఏడు నిమిషాల్లో ట్రిప్ పూర్తవుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వారంలో ఏడు రోజులూ ఈ ఆపరేషన్స్‌ని నిర్వహిస్తారు. అలాగే ఆర్టఇఏ అల్ ఖోర్ వైల్డ్‌లైఫ్ శాంక్చరీకి కూడా ఎయిర్ కండిషన్డ్ బోట్లను నడపనుంది. గత ఏడాది 13 మిలియన్ల మంది మెరిటైమ్ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగించారనీ, ఈ ఏడాది మరింతగా ప్రయాణీకుల్ని ఆకర్షిస్తామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







