గాంబియాకి బాడీగార్డ్‌లను పంపడంలేదు: కువైట్
- May 26, 2016
గాంబియన్ మీడియా, ప్రెసిడెంట్ యాయా జెమ్మెకి కువైట్ నుంచి బాడీగార్డులను పంపుతున్నట్లుగా చేస్తున్న ప్రచారాన్ని కువైట్ ఖండించింది. ఆఫ్రికన్ అఫైర్స్ అసిస్టెంట్ పారిన్ మినిస్టర్ హమాద్ అల్ మషాన్ మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. 320 మంది శిక్షణ పొందిన బాడీగార్డుల్ని గాంబియాకి కువైట్ పంపుతున్నారనే వార్తలు గాంబియన్ మీడియాలో వెల్లువెత్తాయి. ఏప్రిల్ 2016లో గాంబియా ప్రెసిడెంట్ భార్య మేడమ్ జైనాబ్ కువైట్‌లో పర్యటించిన సందర్భంలో ఈ ఒప్పందం కుదిరిందని ఓ వార్తా పత్రిక కథనాన్ని ప్రచురించింది. గాంబియాని ఇస్లామిక్ దేశంగా మార్చే ప్రయత్నాల్లోనే ఇదంతా జరుగుతోందని ఆ కథనంలో విశ్లేసించగా, కువైట్ తాము అలాంటి చర్యలకు పాల్పడటం లేదనీ, ఎలాంటి సమాచారం లేకుండా ఆ వార్తలు రాశారని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







