ఎయిర్‌ కండిషన్డ్‌ అబ్రా ప్రారంభం

- May 26, 2016 , by Maagulf
ఎయిర్‌ కండిషన్డ్‌ అబ్రా ప్రారంభం


ఎయిర్‌ కండిషన్డ్‌ అబ్రా సర్వీస్‌ ఇప్పుడు కమ్యూటర్స్‌కి అందుబాటులోకి రానుంది. రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ ఈ కొత్త సర్వీసును ఇటీవల ప్రారంభించింది. అలాగే ఆర్‌టిఎ అల్‌ జడాఫ్‌లో కొత్త మెరైన్‌ స్టేషన్‌ని ఏర్పాటు చేసింది. ఈ స్టేషన్‌ ద్వారా దుబాయ్‌ క్రీక్‌ మెట్రోస్టేషన్‌కి ఈజీ లింక్‌ ఏర్పడింది. ఎయిర్‌ కండిషన్డ్‌ అబ్రాను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 20 సీట్లు గల ఈ బోట్‌లో పనారమిక్‌ రూఫ్‌తోపాటు, లేటెస్ట్‌ టెక్నాలజీని వినియోగించి రూపొందించారు. దీనికి రెండు ఎకో ఫ్రెండ్లీ ఇంజిన్లను అమర్చారు. 10 మీటర్ల పొడవు 3.4 మీటర్ల వెడల్పుతో వీటిని తయారుచేశారు. అల్‌ జడాఫ్‌ స్టేషన్‌ నుంచి ఫెస్టివల్‌ సిటీ స్టేషన్‌ వరకు ఈ ఎయిర్‌ కండిషన్డ్‌ ఆబ్రా ఆపరేషన్స్‌ కొనసాగుతాయి. ఏడు నిమిషాల్లో ట్రిప్‌ పూర్తవుతుంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వారంలో ఏడు రోజులూ ఈ ఆపరేషన్స్‌ని నిర్వహిస్తారు. అలాగే ఆర్టఇఏ అల్‌ ఖోర్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చరీకి కూడా ఎయిర్‌ కండిషన్డ్‌ బోట్లను నడపనుంది. గత ఏడాది 13 మిలియన్ల మంది మెరిటైమ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ని వినియోగించారనీ, ఈ ఏడాది మరింతగా ప్రయాణీకుల్ని ఆకర్షిస్తామని అధికారులు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com