రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ!
- December 06, 2023
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు తరలిరానున్నారు. అయితే, స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియాగాంధీ వస్తారా? లేదా? అనే విషయంలో అందరిలో కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి ఆమె తెరదించారు. రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మీరు రేపు హైదరాబాద్ కు వెళ్తున్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించగా… ‘వెళ్లొచ్చు’ అని ఆమె సమాధానమిచ్చారు. దీంతో, సోనియా హైదరాబాద్ కు వస్తున్నారనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్టయింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష