అంతర్జాతీయ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి
- December 06, 2023
రాజమహేంద్రవరం: ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ , చైతన్య విద్యా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంధ్రమేవ జయతే! అన్న నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా తేదీలు 5,6,7 జనవరి 2024 శ్రీ రాజరాజనరేంద్రుల వారి పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం, గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలకు త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి విచ్చేయనున్నారని పరిషత్ అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజులు తెలిపారు.గవర్నర్ ని అధ్యక్షులు డా.గజల్ శ్రీనివాస్, మహాసభల ముఖ్య సమన్వయ కర్త కేశిరాజు రామప్రసాద్, సలహదారు తాతా సాయిబాబా కలసి దిల్ ఖుష్ అతిధి గృహం, హైదరాబాద్ లో ప్రత్యేకంగా కలసి ఆహ్వానించినట్లు తెలిపారు.
5 జనవరి 2024 సాయంత్రం 5 గంటలకు జరిగే "పూర్ణకుంభ పురస్కారాల ప్రధానోత్సవ సభకు వారు ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రాచీన రాజ, కవుల వంశీకులను, కీర్తి శేషులైన తెలుగు వెలుగుల కుటుంబాల వారిని, నేటి ప్రఖ్యాత సాహితీ,చలనచిత్ర ,లలిత కళల కు సేవలందించిన లబ్ద ప్రతిష్టులకు, పత్రికలకు, అంతర్జాతీయ, జాతీయ సాంస్కృతిక తెలుగు సంఘాలకు "పూర్ణకుంభ కుంభ పురస్కారాలు" ప్రదానం చేసి, వారి ఆత్మీయ సందేశాన్ని ఇవ్వనున్నారని డా.గజల్ శ్రీనివాస్.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష